కొంత కాలంగా ఓఎల్ఎక్స్ లో వాహనాల నకిలీ ఫొటోలు పెడుతూ... మోసాలకు పాల్పడుతున్న ముఠాను హైదరాబాద్ సైబర్ క్రైం పోలీసులు అరెస్టు చేశారు. రాజస్థాన్ రాష్ట్రం భరత్‌పూర్‌కు చెందిన 9 మంది నిందుతులను అదుపులోకి తీసుకున్నారు. నగరానికి చెందిన ఎనిమిది మందిని వీరు మోసం చేసినట్టు పోలీసులు తెలిపారు.
ఓఎల్ఎక్స్లో మోసాలు.. తొమ్మిదిమంది అరెస్టు - ఓఎల్ఎక్స్లో మోసాల ముఠా అరెస్టు
ఓఎల్ఎక్స్లో వాహనాల ఫొటోలు పెట్టి తక్కువ ధరకు అమ్ముతామంటూ... మోసాలకు పాల్పడుతున్న రాజస్థాన్‌కు చెందిన ముఠాను హైదరాబాద్ సీసీఎస్ పోలీసులు అరెస్టు చేశారు.
![ఓఎల్ఎక్స్లో మోసాలు.. తొమ్మిదిమంది అరెస్టు ఓఎల్ఎక్స్లో మోసాలు.. నిందితుల అరెస్టు](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9121716-thumbnail-3x2-ccs.jpg)
ఓఎల్ఎక్స్లో మోసాలు.. నిందితుల అరెస్టు
టూ వీలర్, ఫోర్ వీలర్, ఫొటో కెమెరాలు... తక్కువ ధరలకు అమ్ముతామంటూ పోస్టు ఉంచుతారు. బుక్ చేసుకున్నవారి నుంచి డబ్బులు బదిలీ చేయించుకుంటారు. ఆ తర్వాత ఎలాంటి స్పందన లేకపోవడం, వస్తువులు రాకపోవడం వల్ల మోసపోయామని బాధితులు గ్రహంచి, సీసీఎస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో తొమ్మిది మందిని అరెస్టు చేసినట్టు సీసీఎస్ పోలీసులు తెలిపారు.
ఇదీ చూడండి:యూఎస్ కంపెనీ పేరుతో గాలం.. రూ.52 లక్షల మోసం