ఏపీలోని కర్నూలు జిల్లా కోవెలకుంట్ల మండలం రేవనూరులో విషాదం నెలకొంది. భార్య ఆత్మహత్య చేసుకుందని భర్త కూడా ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో రామలక్ష్మి (21) ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ విషయం తెలిసిన వెంటనే.. భర్త వెంకటరమణ పురుగుల మందు తాగి బలవణ్మరణానికి పాల్పడ్డాడు. వెంకటరమణను వెంటనే నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
భార్య ఆత్మహత్య... అది తెలిసి భర్త కూడా..! - కర్నూలులో ఆత్మహత్య
భార్య ఆత్మహత్య చేసుకుందని తెలిసి... భర్త ఆత్మహత్యయత్నానికి పాల్పడిన ఘటన ఏపీలోని కర్నూలు జిల్లాలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భార్య ఆత్మహత్య... అది తెలిసి భర్త కూడా..!
గోస్పాడు మండలం యాలూరుకు చెందిన రామలక్ష్మిని వెంకటరమణ 5 నెలల కిందట వివాహం చేసుకున్నాడు. ఊహించని విధంగా ఆమె ఇంట్లో ఉరివేసుకొని మృతి చెందటం అనుమానాలకు తావిస్తోంది. రేవనూరు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తును చేస్తున్నారు.
ఇదీ చదవండి:బైక్‌ను ఢీకొట్టిన టిప్పర్... ఇద్దరు మిత్రులు మృతి