అనారోగ్యంతో బాదపడుతూ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు మండలం అనాజిపురంలో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన వల్లందాస్ గణేష్ (32) ఆటో డ్రైవర్. ఇతనికి ఐదు సంవత్సరాల క్రితం శాలిగౌరారం మండలానికి చెందిన మమతతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు అబ్బాయిలు ఉన్నారు.
ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య - కుటుంబ కలహాలతో భర్త ఆత్మహత్య అనాజిపురం
కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు ఆలుమగల మధ్య గొడవకు దారితీసింది. పెళ్లి రోజు ఘర్షణ మరీ ఎక్కువ కావడం వల్ల తట్టుకోలేని భర్త బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఈ విషాదకర ఘటన యాదాద్రి జిల్లా అనాజిపురంలో చోటుచేసుకుంది.

ఆర్థిక ఇబ్బందులతో పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య
ఆరోగ్యం సరిగా లేకపోవడం, ఆర్థిక ఇబ్బందుల కారణంగా మనస్తాపం చెందిన గణేష్ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. చికిత్స నిమిత్తం భువనగిరి ఏరియా ఆసుపత్రికి తరలించగా మార్గమద్యలో మృతి చెందాడు. భార్య మమత పిర్యాదుతో శవపరీక్ష నిర్వసించి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్ఐ ఉదయ్ కిరణ్ తెలిపారు.
ఇదీ చదవండి:తుంగభద్ర నదిలో జారిపడి యువకుడి మృతి
Last Updated : Nov 21, 2020, 3:43 AM IST