యాదాద్రి భువనగిరి జిల్లా కాశగూడానికి చెందిన ఎస్కే యాకూబ్, యాకూబీ భార్యాభర్తలు. వీరికి ఒక అమ్మాయి, అబ్బాయి ఉన్నారు. గత కొంత కాలంగా భార్యా భర్తలిద్దరికి వేరే వారితో వివాహేతర సంబంధాలు ఉన్నాయని తరచూ ఒకరినొకరు దూషించుకున్నారు. ఈ నేపథ్యంలో భర్త పలుమార్లు ఆత్మహత్యాయత్నం చేశాడని గ్రామస్థులు తెలిపారు.
ఈ నెల 16న మనోవేదనకు గురైన భర్త పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. చికిత్స నిమిత్తం 108 వాహనంలో హైదరాబాద్ ఉస్మానియా ఆసుత్రికి తరలించారు. అయితే చికిత్స పోందుతూ శుక్రవారం యాకూబ్ మృతి చెందాడు. యాకూబ్ ఆత్మహత్యకు కారకులను శిక్షించాలని బంధువులు ఆందోళన చేపట్టారు.