ఆంధ్రప్రదేశ్లోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి మండలంలోని ఓబులాయ పల్లెలో భార్య, భర్తల మధ్య ఏర్పడిన వివాదంలో మనస్తానికి గురై భర్త కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్న ఘటన జరిగింది. కాలనీకి చెందిన సుబ్రహ్మణ్యం, తన భార్యతో వివాదానికి దిగారు. ఈ క్రమంలోనే ఉన్నట్లు ఉండి కిరోసిన్ ఒంటి పై పోసుకొని నిప్పు పెట్టుకున్నారు. శరీరం 60శాతం వరకు కాలి పోవడం వల్ల ఆరోగ్య పరిస్థితి విషమంగా మారింది. స్థానికులు గుర్తించి వైద్యం నిమిత్తం తిరుపతి రూయకు తరలించారు.
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం - wife and husband quarrel
ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తిలో భార్య పై కోపంతో ఓ వ్యక్తి ఒంటిపై కిరోసిన్ పోసుకుని నిప్పు అంటించుకున్నాడు. శరీరం 60 శాతం వరకు కాలిపోయింది. బాధితుడు తిరుపతి రూయ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.
భార్యతో గొడవ.. భర్త ఆత్మహత్యాయత్నం