తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యకు కరోనా.. గుండెపోటుతో భర్త మృతి

భార్యకు కరోనా పాజిటివ్ వచ్చిందని తెలుసుకున్న భర్త గుండెపోటుతో మరణించిన ఘటన జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేటలో చోటుచేసుకుంది.

జగిత్యాల
జగిత్యాల

By

Published : Sep 1, 2020, 9:09 PM IST

జగిత్యాల జిల్లా మల్లాపూర్‌ మండలం రాఘవపేటకు చెందిన ఓ మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు తెలుసుకున్న భర్త గుండె పోటుతో మరణించాడు. అంత్యక్రియలను నిర్వహించడానికి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, గ్రామస్థులు ఎవరూ ముందుకు రాలేదు.

విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే విద్యాసాగర్‌రావు కోరుట్లలోని ‘ఆల్‌ ఇండియా మానవత్వ సందేశ సమితి’ అనే స్వచ్ఛంద సంస్థ సభ్యులను సంప్రదించారు. హిందూ సంప్రదాయం ప్రకారం కొవిడ్‌ కిట్లతో మరణించిన వ్యక్తి అంతక్రియలు నిర్వహించారు. అంత్యక్రియల్లో సంస్థ సభ్యులు నాసిర్‌ అలీ, ఇషాక్‌, అబ్ధుల్లా, సూఫీయాన్‌, హాఫీజ్‌, ముజిహిద్‌లు పాల్గొన్నారు.

ABOUT THE AUTHOR

...view details