సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం రాంసాగర్ గ్రామంలో భార్యను హత్య చేసిన నిందితుడు స్వామి పోలీసుల ఎదుట లోంగిపోయాడు. అదుపులోకి తీసుకున్న పోలీసులు స్వామిని న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నిందితునికి కోర్టు రిమాండ్ విధించినట్లు హుస్నాబాద్ ఎసీపీ మహేందర్ తెలిపారు.
వివాహేతర సంబంధానికి అడ్డుపడుతుందనే హత్య - murder news
వివాహేతర సంబంధానికి అడ్డువస్తుందనే కారణంతోనే సిద్దిపేట చేర్యాల మండలం రాంసాగర్లో తన భార్యను హత్య చేసినట్లు పోలీసులు వెల్లడించారు. పోలీసుల ఎదుట లొంగిపోయిన నిందితున్ని కోర్టులో ప్రవేశపెట్టారు.
husband murdered his wife
వివాహేతర సంబంధానికి అడ్డుపడుతుందనే కారణంగానే స్వామి తన భార్యను గొంతు నులిమి హత్య చేశాడని ఎసీపీ స్పష్టం చేశారు. ఆదివారం రాత్రి దంపతుల మధ్య జరిగిన తగదాలో ఆవేశానికి గురైన స్వామి... తన భార్య యాదమ్మ గొంతు నులిమి చంపిన విషయం తెలిసిందే.