నల్గొండ జిల్లా కేతేపల్లి మండలం గుడివాడలో విషాదం చోటుచేసుకుంది. రాచకొండ మంగమ్మ అనే మహిళ.. భర్త చేతిలో దారుణ హత్యకు గురైంది. మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్తతో జరిగిన చిన్నపాటి తగాదా ఆమె ప్రాణాల మీదకు తెచ్చింది. సోమవారం అర్ధరాత్రి భర్త కాటయ్య భార్య మంగమ్మను ఇంటిలో ఉన్న సుత్తితో తలపై మోదాడు. ఆమె అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. భార్య మృతి చెందిందని గ్రహించిన నిందితుడు పరారయ్యాడు. విషయం తెలుసుకున్న కేతేపల్లి పోలీసులు విచారణ చేపట్టారు. నిందితుడి కోసం గాలిస్తున్నారు.
భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త - latest crime news in nalgonda
ఓ భర్త.. భార్యను సుత్తితో తలపై మోది హత్య చేసిన ఘటన నల్గొండ జిల్లా గుడివాడలో చోటుచేసుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
భార్యను సుత్తితో కొట్టి చంపిన భర్త