నాగర్కర్నూల్ జిల్లా లింగాల మండలం క్యాంపు రాయవరంలో దారుణం చోటుచేసుకుంది. కోడి కూర వండలేదనే కోపంతో సీతమ్మ అనే మహిళను భర్త సన్నయ్య కర్రతో కొట్టి హతమార్చాడు.
సీతమ్మ, సన్నయ్య దంపతులు వ్యవసాయం చేస్తూ.. జీవనం సాగిస్తున్నారు. సన్నయ్యకు మద్యం అలవాటు ఉంది. ఈ క్రమంలో సోమవారం పొలం పనులకు వెళ్లిన భర్త సన్నయ్యకు సీతమ్మ మధ్యాహ్నం వేళ భోజనం తీసుకెళ్లింది. అప్పటికే మద్యం మత్తులో ఉన్న సన్నయ్య.. పండుగ పూట కోడి కూర ఎందుకు వండలేదని సీతమ్మతో గొడవకు దిగాడు. కోపంలో పెద్ద కర్రతో భార్యపై దాడి చేయగా.. సీతమ్మ అక్కడికక్కడే కుప్పకూలిపోయింది.