భార్యపై అనుమానం పెంచుకున్న భర్త తనను అంతమొందించాలనుకున్నాడు. పైగా ఆత్మహత్యగా చిత్రీకరించాలని భావించాడు. అనుమానం వచ్చిన పోలీసులు తమదైన శైలిలో విచారించగా... తానే హత్యచేసినట్లుగా అంగీకరించాడు. ప్రకాశం జిల్లా కనిగిరిలో జరిగిన కిరాతక ఘటన ఇది.
అసలేం జరిగింది...?
15 ఏళ్ల క్రితం ఖాసిం సాహేబ్, ఫాతిమాలకు వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. టైలరింగ్ చేస్తున్న ఖాసింకు ఆదాయం చాలక... భార్య ఫాతిమాను మూడు నెలల క్రితం స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్‌గా జాయిన్ చేశాడు. అప్పటి నుంచి ఆమెపై అనుమానం పెంచుకున్నాడు. ఇంట్లో పిల్లలు లేని సమయంలో ఇద్దరు తరచూ గొడవ పడేవారు. ఓ రోజు ఆ చిన్న గొడవ కాస్త పెద్దదై భార్య ముఖాన్ని గ్యాస్‌తో కాల్చాడు. తీవ్ర గాయమై దీనావస్థలతో కేకలు పెట్టింది. అనంతరం ఆమెను చపాతీల కర్రతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడు. కింద పడి విలవిలలాడుతున్న ఆమెను చూసి కసి తీరక గొంతు నులిమి హత్య చేశాడు. ఘటనపై దర్యాప్తు చేసిన పోలీసులు ఖాసింను అదుపులోకి తీసుకున్నారు.
గ్యాస్‌తో ముఖాన్ని కాల్చి... గొంతు నులిమి చంపేశాడు ఇదీ చూడండి :తల్లిని హత్య చేసిన కేసులో దర్యాప్తు వేగవంతం