ఆంధ్రప్రదేశ్లోని కడప జిల్లా ప్రొద్దుటూరులో దారుణం జరిగింది. అనుమానంతో ఓ వ్యక్తి తన భార్యను కిరాతకంగా హతమార్చాడు. పట్టణంలోని 36వ సచివాలయం 11వ క్లస్టర్లో స్వర్ణలత(35) అనే మహిళ విధులు నిర్వహిస్తున్నారు. ఆమెపై భర్త జయరామిరెడ్డి అనుమానం పెంచుకున్నాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించారు.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త - భార్య మెడకు వైరును బిగించి హత్య
భార్య ఉద్యోగం చేయటం భర్తకు నచ్చలేదు. ఆమె ప్రతి కదలికను అనుమానించి వేధించాడు. ఉద్యోగం మానేయాలని ఒత్తిడి చేశాడు. అందుకు ఆమె నిరాకరించింది. అదే ఆ మహిళ పాలిట శాపంగా మారింది.
అనుమానంతో భార్యను హత్య చేసిన భర్త
దీంతో అతను ఆగ్రహానికిలోనై భార్య మెడకు వైరును బిగించి హత్య చేశాడు. మృతురాలి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు.
ఇదీ చదవండి:అవినీతి ఆరోపణలు రుజువై కమలాపూర్ సీఐ రవిరాజాపై సస్పెన్షన్ వేటు