హైదరాబాద్లోని మీర్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రశాంత్ నగర్లో దారుణం చోటు చేసుకుంది. అన్నం పెట్టలేదనే కోపంతో భార్యను చంపేశాడు ఓ భర్త. జయమ్మ అనే మహిళ కొడుకుతో కలిసి వివాహానికి వెళ్లొచ్చింది. రాగానే తన భర్త శ్రీనివాస్ అన్నం వండమని, లారీ డ్రైవింగ్ పనికి పోయేది ఉందని చెప్పగా ఆమె నిరాకరించింది. ఇద్దరి మధ్య వాగ్వాదం పెరిగి కోపంతో భార్య మెడను చీరతో నులిమి హతమార్చాడు శ్రీనివాస్ గౌడ్.
అన్నం పెట్టలేదని గొంతు నులిమి... భార్యని చంపేశాడు! - హైదరాబాద్ జిల్లా వార్తలు
అన్నం పెట్టలేదని భార్యని చంపేశాడు ఓ భర్త. పెళ్లికి వెళ్లొచ్చిన భార్యని వంట చేయమని అడగగా ఆమె నిరాకరించింది. క్రమంగా వాగ్వాదం పెరిగి ఆగ్రహించిన ఆమె భర్త... చీరతో భార్య గొంతు నులిమేశాడు. మీర్పేట్లోని ప్రశాంత్ నగర్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
అన్నం పెట్టలేదని గొంతు నులిమి... భార్యని చంపేశాడు!
ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ఉస్మానియాకు తరలించారు. నిందితుడు శ్రీనివాస్ పరారీలో ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
ఇదీ చదవండి:నేను చనిపోతున్నా.. వెతకొద్దు నాన్నా...