మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపాలిటీ పరిధిలోని బాపూజీనగర్‌లో శ్యామ్, సరోజ దంపతులు నివసిస్తున్నారు. శ్యామ్ స్థానికంగా వాచ్‌మెన్‌గా పని చేస్తున్నారు. మద్యానికి బానిసైన అతను రోజూ తాగొచ్చి భార్యను హింసిస్తుండే వాడు.
తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య - హైదరాబాద్ వార్తలు
మద్యం తాగొచ్చి వేధిస్తున్నాడని ఓ భార్య భర్తను చంపిన ఘటన మేడ్చల్ జిల్లా నాగారంలో జరిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు.
![తాగొచ్చి వేధిస్తున్నాడని భర్తను హత్య చేసిన భార్య husband murdered by his wife in medchal district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-10102981-thumbnail-3x2-drink.jpg)
వేధిస్తున్నాడని భర్తను హతమార్చిన భార్య
శనివారం రాత్రి తాగొచ్చిన శ్యామ్.. భార్య సరోజతో గొడవ పడ్డారు. సరోజ ఆవేశంతో భర్తపై రోకలి బండతో దాడి చేసింది. శ్యామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితురాలిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
ఇదీ చదవండి:తాటిచెట్టుపై నుంచి పడి వ్యక్తి మృతి