వివాహేతర సంబంధానికి అడ్డొస్తున్నాడని ప్రియుడితో భర్తను హత్య చేయించిన ఘటన... మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని సైదొనిగడ్డ తండాలో మే నెలలో చోటుచేసుకుంది. మృతుడి భార్యతోపాటు నలుగురు అనుమానితులను పోలీసులు ఇవాళ అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించినట్టు పేట్ బషీర్బాద్ ఏసీపీ నర్సింహారావు తెలిపారు.
మేడ్చల్ మండలం సైదొనిగడ్డ తండాకు చెందిన సురేష్ భార్య బబిత, దుండిగల్ తండాకు చెందిన ప్రేమ్ సింగ్‌కు మధ్య కొంత కాలంగా వివాహేతర సంబంధం కొనసాగుతోంది. భర్త అడ్డు తొలగించుకోవాలని నిర్ణయించుకున్న బబిత... ప్రియుడుతో చెప్పింది. ప్రేమ్‌సింగ్ తన స్నేహితులు రాహుల్, రాజు, అజ్మీర్ ప్రేమ్‌తో కలిసి పథకం పన్నాడు.