ఖమ్మం జిల్లా ఎర్రుపాలెం మండలం అయ్యవారిగూడెనికి చెందిన యువతి నవ్యకు గతేడాది డిసెంబర్ 9న సొంత బావ నాగశేషు రెడ్డితో వివాహం జరిగింది. పెళ్లైన కొద్ది రోజులకే భార్య నవ్యపై.... భర్త అనుమానం పెంచుకున్నట్లు తెలుస్తోంది. నవ్యకు నిద్రమాత్రలిచ్చి మంగళవారం ఇంట్లో నుంచి తీసుకెళ్లాడు. అక్కడి నుంచి పెనుబల్లి మండలం కొత్తలంకపల్లి శివారులోని కుక్కలగుట్ట వద్దకు తీసుకెళ్లి దారుణంగా హత్య చేశాడు. అనంతరం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లుగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు.
పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై... - ఖమ్మం జిల్లా వార్తలు
పెళ్లి అయి రెండు నెలలు కూడా కాకముందే యువతి దారుణ హత్యకు గురైంది. కట్టుకున్న వాడు... సొంత బావే ఆమె పాలిట కాలయముడయ్యాడు. భార్యపై అనుమానం పెంచుకుని ఈ దారుణానికి ఒడిగట్టినట్లు తెలుస్తోంది.
కట్టుకున్నవాడే కాలయముడై... పెళ్లై రెండు నెలలు గడవకముందే..
పెళ్లైన రెండునెలలకే చంపేశాడు.. ఆపై...
ఇంజినీరింగ్‌లో బ్యాక్‌లాగ్‌లు ఉండటం వల్ల మనస్తాపంతో ఆత్మహత్య చేసుకుంటున్నట్లుగా నవ్య ఫోన్ నుంచి అత్తమామలకు మెసేజ్ పంపించాడు. తర్వాత భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసుల దర్యాప్తులో నవ్యను నాగశేషు రెడ్డే బైక్‌పై తీసుకెళ్తున్నట్లు సీసీటీవీలో దృశ్యాలు లభించాయి. పోలీసులు తమదైన శైలిలో నాగశేషు రెడ్డిని విచారించగా... హత్య విషయం బయటపడింది.
ఇదీ చూడండి:విద్యార్థిని ఆత్మహత్య.. వాళ్లే కారణమా?