తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

అత్తింటి వారు బైక్​ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త - ananthapur news

అత్తింటి వారు ద్విచక్రవాహనాన్ని కొనివ్వలేదని భార్యను హతమార్చాడు ఓ ప్రబుద్ధుడు. భార్యాభర్తల మధ్య జరిగిన ఘర్షణలో కోపంతో భార్య గొంతుపై కాలితో తొక్కి దారుణంగా హత్యచేశాడు. ఈ ఘటన ఏపీలోని అనంతపురం జిల్లా పామిడి మండలం నెమలపల్లిలో జరిగింది.

అత్తింటి వారు బైక్​ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త
అత్తింటి వారు బైక్​ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త

By

Published : Sep 4, 2020, 10:38 PM IST

ఆంధ్రప్రదేశ్​లోని అనంతపురం జిల్లా పామిడి మండలం నెమలపల్లి గ్రామానికి చెందిన సుబ్బారాయుడు... 11 నెలల క్రితం ఉరవకొండ మండలం వజ్రకరూరు గ్రామానికి చెందిన లక్ష్మిని వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో అదనపు కట్నం తీసుకురావాలంటూ భార్యపై ఒత్తిడి తెచ్చాడు. నెల క్రితం తనకు ద్విచక్రవాహనం కొనివ్వాలంటూ అత్తింటి వారిని కోరాడు. తమకు అంత స్తోమత లేదని, ప్రస్తుతానికి కొనివ్వలేమని వారు చెప్పడంతో కోపోద్రిక్తుడైన సుబ్బారాయుడు లక్ష్మితో గొడవ పడ్డాడు.

ఈ క్రమంలో కోపంతో లక్ష్మి గొంతుపై కాలితో తొక్కి అత్యంత కిరాతకంగా హత్య చేశాడు. విషయాన్ని గమనించిన స్థానికులు.. పోలీసులకు సమాచారం ఇవ్వడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హంతకుడు సుబ్బరాయుడిని అదుపులోకి తీసుకున్నారు.

అత్తింటి వారు బైక్​ కొనివ్వలేదని భార్యను హతమార్చిన భర్త

ఇదీచదవండి.

అప్పు తీర్చమన్న భర్తను చంపేశారు... కేసు పెట్టిన భార్యను కొట్టించారు...!

ABOUT THE AUTHOR

...view details