తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యను హతమార్చి.. ఏమీ ఎరగనట్టు పోలీసులకు ఫిర్యాదు... - Vikarabad district crime news

మద్యం మత్తులో విచక్షణ కోల్పోయి భార్యను హత్య చేశాడు. ఆపై మృతదేహాన్ని డీజిల్‌ పోసి నిప్పటించాడు. కాలిన దేహాన్ని మూటగట్టి ట్రాలీ ఆటోలో తీసుకెళ్లి అనంతగిరి అటవీ ప్రాంతంలోని వంతెన కింద పడవేసి ఏమీ ఎరుగనట్లుగా వచ్చాడు. తన భార్య కనిపించడం లేదని పోలీస్‌ ఠాణాలో ఫిర్యాదు చేసిన సంఘటన వికారాబాద్ జిల్లా కేంద్రంలోని రాజీవ్ గృహకల్ప సమీపంలో చోటుచేసుకుంది.

husband killed his wife in vikarabad
వికారాబాద్​లో భార్యను చంపిన భర్త

By

Published : Nov 17, 2020, 7:54 AM IST

వికారాబాద్‌ పట్టణం రాజీవ్‌ గృహకల్ప సమీపంలో నివాసం ఉండే బానాల ప్రభుకు 2007లో సంతోష(32)తో పెళ్లి జరిగింది. వీరికి ముగ్గురు కొడుకులు విజయ్‌, సన్నీ, జంపన్న, కూతురు సారిక సంతానం. గాడిద పాలు అమ్ముకొని జీవించే ప్రభు నిత్యం మద్యం తాగి భార్యతో గొడవ పడేవాడు. ఈ క్రమంలో ఈ నెల 11న భార్యతో గొడవపడి తీవ్రంగా కొట్టడం వల్ల ఆమె మృతి చెందింది. మృతదేహాన్ని డీజిల్‌ పోసి నిప్పంటించాడు. దాన్ని సంచిలో చుట్టి ట్రాలీ ఆటోలో బుగ్గ రామేశ్వరం మీదుగా కెరేళ్లి మార్గంలో ఉన్న లోతువాగు వంతెన కింద పడేశాడు. 12న తన భార్య కనిపించడం లేదంటూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

పోలీసులు విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాలేదు. పోలీసులకు మెల్లమెల్లగా భర్తపై అనుమానం బలపడగా, ఈ నెల 15న స్థానిక కౌన్సిలర్‌ నర్సింహులు దగ్గరికి వెళ్లి విషయాన్ని చెప్పాడు. కౌన్సిలర్‌ పోలీసులకు సమాచారం అందించి ప్రభును అప్పగించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు.

ఇదీ చూడండి:విషాదం: నాటుబాంబు పేలి విద్యార్థి మృతి

ABOUT THE AUTHOR

...view details