మతిస్థిమితం లేని భర్త.. భార్యను గొడ్డలితో నరికి చంపిన ఘటన నారాయణపేట జిల్లా నర్వ మండలం పెద్ద కడుమూర్లో చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన గోవిందు, సరోజ దంపతులు. వీరికి ఇద్దరు పిల్లలు. కొన్ని నెలలుగా గోవిందు మతిస్థిమితం లేకుండా.. భార్యతో తరచూ గొడవ పడేవాడని స్థానికులు తెలిపారు. ఆదివారం రాత్రి భార్యభర్తలిద్దరి మధ్య ఘర్షణ చోటు చేసుకుందని... గొడవ సద్దుమణిగి సరోజ నిద్రిస్తున్న సమయంలో గోవిందు గొడ్డలితో దాడి చేశాడని వెల్లడించారు.
భార్య నిద్రిస్తున్న సమయంలో... గొడ్డలితో నరికేశాడు - నార్వ మండలం వార్తలు
మతిస్థిమితం లేని భర్త.. భార్య నిద్రిస్తున్న సమయంలో గొడ్డలితో దాడి చేశాడు. బాధితురాలిని ఆస్పత్రికి తరలించగా... చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిన ఘటన నర్వ మండలం పెద్ద కడుమూర్లో చోటుచేసుకుంది.

భార్య నిద్రిస్తున్న సమయంలో... గొడ్డలితో నరికేశాడు
కేకలు విని ఘటన స్థలానికి చేరుకున్న స్థానికులు తీవ్ర రక్తస్రావంతో కొట్టుమిట్టాడుతున్న సరోజను వనపర్తి జిల్లాలోని ఆత్మకూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందిందని గ్రామస్థులు తెలిపారు. గోవిందును పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నవీద్ పేర్కొన్నారు.
ఇదీ చూడండి:రోడ్డు దాటుతుండగా వ్యక్తిని ఢీకొట్టిన కారు.. అక్కడికక్కడే మృతి