భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపాడు మండలం సారపాకలోని గాంధీనగర్‌లో దారుణం చోటు చేసుకుంది. తులానగర్కు చెందిన జనార్దన్‌కు... గాంధీనగర్‌కు చెందిన అనూషతో 7 సంవత్సరాల క్రితం పెళ్లైంది. వీరికి ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు.
భద్రాద్రిలో దారుణం: పుట్టింట్లోనే భార్యను హతమార్చిన భర్త - భార్యను చంపిన భర్త వార్తలు
పిల్లలతో కలిసి భార్య ఇంటికి వెళ్లిన భర్త... అక్కడే ఆమెను గొంతు కోసి దారుణంగా హతమార్చాడు. అనంతరం అతను పరారైన ఘటన బూర్గంపాడులో చోటుచేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
భద్రాద్రిలో దారుణం: పుట్టింట్లోనే భార్యను హతమార్చిన భర్త
ఇటీవల భర్తతో కలిసి అనూష పుట్టింటికి వచ్చింది. భార్య తల్లిదండ్రులు బయటకు వెళ్లిన అనంతరం జనార్దన్... భార్యను కత్తితో మెడ కోసి దారుణంగా హత్య చేశాడు. అనంతరం పరారయ్యాడు. స్థానికులు గమనించి బూర్గంపాడు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై బాలకృష్ణ సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించి... కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
ఇదీ చూడండి:పెళ్లైన 20 రోజులకే... భర్తను చంపేసింది
Last Updated : Sep 11, 2020, 6:33 PM IST