ఏపీలోని కృష్ణా జిల్లా గుడివాడ ఫైర్ స్టేషన్లో ఫైర్మన్గా పనిచేస్తున్న గొరిపర్తి శ్రీనివాసరావు ఓ మహిళతో పెట్టుకున్న వివాహేతర సంబంధాన్ని ఆయన భార్య లక్ష్మి బయటపెట్టింది. రెండేళ్ల క్రితం భార్యను వరకట్నం కోసం వేధించి ఇంటికి పంపిన శ్రీనివాసరావు మరో మహిళతో రాసలీలలు సాగిస్తున్నాడు.
భర్త వివాహేతర గుట్టును బయటపెట్టిన భార్య - గుడివాడ ఫైర్ కానిస్టేబుల్ వార్త
అతనో ప్రభుత్వ ఉద్యోగి. జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుకోవాల్సిన భార్యను వరకట్నం వేధింపులతో ఇంటికి పంపాడు. మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. భార్య తన బంధువులతో కలిసి భర్త ఇంటికి వచ్చి చూడగా.. అడ్డంగా బుక్కయ్యాడు.
భర్త వివాహేతర గుట్టును బయటపెట్టిన భార్య
తాజాగా గన్నవరం మండలం దావాజీ గూడెంలో శ్రీనివాసరావు ఓ ఇంట్లో తన ప్రియురాలతో కలిసి అద్దెకు దిగాడు. లక్ష్మి తన బంధువులతో కలిసి భర్త ఉన్న ఇంటికి వెళ్లగా ఆయన ఆ మహిళతో ఉన్నాడు. ఈ విషయమై లక్ష్మి బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
ఇదీ చదవండి:'ఆన్లైన్ లోన్ యాప్లతో జరభద్రం'