నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం బీర్నంది గ్రామానికి చెందిన నగావత్ గోపాల్(35) మూత్రపిండాల వ్యాధితో బాధపడుతున్నాడు. మూడు నెలల నుంచి కడెం మండలం గచ్చుకుంటలోని బంధువుల ఇంటి వద్ద ఉంటున్నారు. రెండు రోజులకోసారి ఉట్నూరు వెళ్లి డయాలిసిస్ చేయించుకుంటున్నారు.
భార్య ఒడిలోనే ఊపిరి వదిలిన భర్త - mahaboobnagar news
భార్య ఒడిలోనే భర్త తుదిశ్వాస విడిచిన ఘటన నిర్మల్ జిల్లా జన్నారం మండలం ఇంధన్పల్లిలో చోటుచేసుకుంది. అప్పటి వరకు కొనఊపిరితో కొట్టుమిట్టాడిన ఆ ప్రాణం... భార్య వచ్చి తన ఒళ్లోకి తీసుకోగానే మనఃశాంతిగా కళ్లు మూశాడు.
![భార్య ఒడిలోనే ఊపిరి వదిలిన భర్త husband died in wife's hands in utnur](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8990166-303-8990166-1601437481443.jpg)
husband died in wife's hands in utnur
ఈ నేపథ్యంలో మంగళవారం ఉట్నూరు వెళ్లి తిరిగి ఇంటికి వెళ్లడానికి ఇంధన్‌పల్లి వద్ద బస్సు కోసం వేచి చూస్తుండగానే శ్వాస తీసుకోవడం ఇబ్బందిగా ఉండటంతో భార్యకు సమాచారం ఇచ్చారు. గ్రామస్థుల సమాచారంతో 108 సిబ్బంది సైతం అక్కడికి చేరుకున్నారు. ఘటనా స్థలానికి చేరుకున్న భార్య మంజుల కొనఊపిరితో ఉన్న గోపాల్‌ను ఒడిలోకి తీసుకోగానే తుదిశ్వాస విడిచారు. ఈక్రమంలో మంజుల రోదించిన తీరు అక్కడున్న వారిని కంటతడి పెట్టించింది.