తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య! - పటాన్​చెరులో నేర వార్తలు

ఫంక్షన్​లో భర్త మద్యం సేవించి గొడవ చేశాడని కాపురానికి రానంది భార్య.. దీంతో మనస్తాపం చెందిన ఆ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు పరిధిలో గురువారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది.

Husband committed suicide as wife is not coming to home
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఆత్మహత్య!

By

Published : Dec 19, 2020, 11:46 AM IST

భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణానికి పాల్పడిన ఘటన సంగారెడ్డి జిల్లా పటాన్​చెరు ఠాణా పరిధిలో జరిగింది. ముత్తంగి పీఎస్ కాలనీకి చెందిన నర్సింహ హరిప్రసాద్(30) అరబిందో పరిశ్రమ యూనిట్-5లో కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఎనిమిదేళ్ల క్రితం వరంగల్ జిల్లా కమలాపూర్​కు చెందిన రత్నపురితో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలు.

నవంబర్ 17న తన సోదరుడి పెళ్లి ఉందని రత్నపురి 45 రోజుల క్రితం పిల్లలతో కలిసి తన పుట్టింటికి వెళ్లింది. పెళ్లి సమయానికి హరిప్రసాద్​ అక్కడికి వెళ్లాడు. కాగా ఆ పెళ్లిలో భర్త మద్యం తాగి గొడవ చేశాడని పెద్దమనుషులతో మాట్లాడితేనే కాపురానికి వస్తానని భార్య చెప్పింది. దీంతో మానసికంగా కుంగిపోయిన హరిప్రసాద్​.. గురువారం రాత్రి చరవాణిలో వీడియో తీస్తూ తన గదిలోని ఫ్యానుకు ఉరేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతుడి సోదరుడి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసున్నారు.

ఇదీ చదవండి:పురుగులమందు తాగి మైనర్ ప్రేమజంట ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details