అన్యోన్యంగా కాపురం చేసుకునే ఆ కుటుంబంలో అనుమానం పెనుచిచ్చు రేపింది. భార్య మీద అనుమానం ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. వరంగల్ గ్రామీణ జిల్లా సంగెం మండలం తీగరాజుపల్లి గ్రామానికి చెందిన రాజు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గత కొంత కాలంగా భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతున్నాయని బంధువులు తెలిపారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు... దర్యాప్తు చేస్తున్నారు.
భార్యపై అనుమానంతో.. భర్త ఆత్మహత్య..! - warangal rural district latest news
అనుమానం పెనుభూతమై ఓ నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్యకు పాల్పడిన ఘటన వరంగల్ రూరల్ జిల్లాలో చోటుచేసుకుంది.

భార్యపై అనుమానంతో.. భార్త ఆత్మహత్య..!