తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్యాయత్నం - krishna district suicide latest news update

ఏపీలోని కృష్ణా జిల్లాలో షేక్ సయ్యద్ బాబు అనే వ్యక్తి ఆత్మహత్యకు యత్నించాడు. భార్య వేరే వ్యక్తితో సన్నిహితంగా ఉందనే అనుమానంతో తరుచూ గొడవలు పడేవారు. ఈ క్రమంలో కొద్ది రోజుల క్రితం అతని భార్య వేరే వ్యక్తితో వెళ్లిపోయిందని.. పోలీసులకు ఫిర్యాదు చేసినప్పటికీ పట్టించుకోలేదని మనస్థాపానికి గురై వ్యక్తి పురుగుల మందు తాగాడు.

Husband commits suicide on suspicion of wife at krishna district of andhra pradesh
భార్యపై అనుమానంతో భర్త ఆత్మహత్యాయత్నం

By

Published : Dec 13, 2020, 7:20 PM IST

ఏపీలోని కృష్ణా జిల్లా వీరులపాడు(మం) జూజ్జారు గ్రామంలో షేక్ సయ్యద్ బాబు అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. తన భార్య మరో వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకొని కనిపించకుండా పోయిందని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు పట్టించుకోకపోవటంతో మనస్థాపానికి గురైన సయ్యద్ పురుగుల మందు తాగాడు. ఆత్మహత్యకు పాల్పడిన వ్యక్తిని చికిత్స నిమిత్తం నందిగామ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ఈ వ్యవహారంపై.. అతడి భార్య స్పందించింది. భర్త వేరే వాళ్ళ మాటలు నమ్మి తనను ప్రతిరోజు చిత్రహింసలకు గురిచేస్తున్నాడని ఆరోపించింది. బావతోపాటుగా అత్త, మామలు తనను వేధించటం వల్లే ఇంటి నుంచి బయటకు వచ్చినట్లు తెలిపింది. మళ్లీ ఇంటికి వెళ్తే తనను చంపేస్తారని ఆవేదన వ్యక్తం చేసింది. అయితే తాను ఏ తప్పు చేయలేదని.. తన భర్త కావాలని నిందలు వేస్తూ, మందు తాగినట్లు నటిస్తున్నాడని వాపోయింది.

ఇవీ చూడండి:కూలీల ఇంట విషాదం.. మృతదేహాలతో ధర్నా

ABOUT THE AUTHOR

...view details