సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురం బొంబాయి కాలనీకి చెందిన చిత్తారి అనే వ్యక్తి కూలీ పని చేసుకొని జీవించేవాడు. అతని భార్య పెంటమ్మ గర్భవతిగా ఉన్నప్పుడు అత్త లక్ష్మి వచ్చి ఆమెను తీసుకెళ్లింది. కాపురానికి పంపమని అడిగినా పంపలేదు. దీనివల్ల వారి కుల సంఘం సమక్షంలో పంచాయితీ నిర్వహించారు. ఈ పంచాయితీలో కూడా తన కూతురుని కాపురానికి పంపనని అత్త చెప్పింది.
భార్య కాపురానికి రావడం లేదని భర్త బలవన్మరణం - భార్య కోసం భర్త ఆత్మహత్య తాజావార్తలు
సంగారెడ్డి జిల్లా రామచంద్రాపురంలో విషాదం చోటుచేసుకుంది. భార్యను కాపురానికి అత్త పంపడంలేదని మనస్థాపం చెందిన భర్త ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. కుటుంబలో విషాదఛాయలు నెలకొన్నాయి.
భార్య కాపురానికి రావడం లేదని భర్త ఏం చేశాడంటే?
మనస్తాపం చెందిన చిత్తారి రామచంద్రాపురం రైల్వే ట్రాక్ సమీపంలోని ముళ్లపొదల్లో ప్లాస్టిక్ తాడుతో ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీచూడండి:రైలు ఢీకొని యువకుడు మృతి