తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

భార్య నగ్న దృశ్యాల కేసు: నిందితుడు అరెస్టు - guntur latest news

కట్టుకున్న భార్య నగ్న దృశ్యాలు, ఫొటోలను అంతర్జాలంలో పెట్టి వ్యాపారం చేస్తున్న వ్యక్తిని ఏపీ గుంటూరు పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.

భార్య నగ్న దృశ్యాల కేసు: నిందితుడు అరెస్టు
భార్య నగ్న దృశ్యాల కేసు: నిందితుడు అరెస్టు

By

Published : Nov 23, 2020, 7:06 PM IST

ఏపీ గుంటూరు ఏటీ అగ్రహారంలో దారుణం చోటుచేసుకుంది. డబ్బు కోసం భార్య నగ్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో పెట్టాడో భర్త. భార్య నగ్న దృశ్యాలు చూపించి డబ్బు చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. భర్త వంశీకాంత్‌రెడ్డి, వీడియోల కోసం డబ్బు చెల్లించిన శివకుమార్​ను‌ అరెస్టు చేశారు.

ఎయిర్ కార్గోలో ఉద్యోగమని నమ్మించి బాధితురాలిని వంశీకాంత్‌రెడ్డి వివాహామాడారు. కట్నం వేధింపుల ఆరోపణపై బాధితురాలి అత్తమామలపైనా కేసు పెట్టింది. బాధితురాలితో ఫోన్‌లో అసభ్యంగా మాట్లాడిన టెక్కలి వాసి సంతోశ్​‌పైనా కేసు నమోదు చేశారు. వివరాలను గుంటూరు అర్బన్ ఎస్పీ అమ్మిరెడ్డి వెల్లడించారు.

ABOUT THE AUTHOR

...view details