వికారాబాద్ ఆర్టీసీ డిపోలో కండెక్టర్‌గా పనిచేస్తున్న అజిమోద్దీన్కు... నజీయా బేగంతో 2014వ సంవత్సరంలో వివాహమైంది. వీరికి ఇద్దరు అమ్మాయిలు. అజిమోద్దీన్ రోజు తాగి వచ్చి భార్యకు, పిల్లలకు నిత్యం నరకం చూపించేవాడు. అతని వేధింపులు తట్టుకోలేని నజీయా పోలీసులను ఆశ్రయించింది.
కట్టుకున్న భార్య, కన్నబిడ్డలకు నరకం చూపించిన శాడిస్ట్ - వికారాబాద్ జిల్లా వార్తలు
అతనో ఆర్టీసీ ఉద్యోగి. కానీ భార్యకు జాబ్ రాలేదనే కోపం... ఆడపిల్లల్నే కన్నదనే ద్వేషం అతనిలో అణువణువు నిండిపోయింది. ఇదే విషయమై రోజు తాగి వచ్చి భార్యను చిత్రహింసలు పెట్టేవాడు. సొంత బిడ్డలే అనే కనికరం లేకుండా వారిని విచక్షణా రహితంగా కొడుతూ, బూతులు తిడుతూ.. వారికి నిత్యం నరకం చూపించిన ఘటన వికారాబాద్ జిల్లాలో చోటు చేసుకుంది.
![కట్టుకున్న భార్య, కన్నబిడ్డలకు నరకం చూపించిన శాడిస్ట్ husband-brutally-tortured-his-wife-and-children-in-vikarabad-district](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8908909-thumbnail-3x2-father.jpg)
తనకు జాబ్ రాలేదని, ఇద్దరూ ఆడపిల్లలే పుట్టారనే నెపంతో రోజు తిడుతూ, కొడుతూ... చంపుతానని తన భర్త బెదిరించేవాడని బాధితురాలు వాపోయింది. చిన్న పిల్లలని చూడకుండా... పిల్లలను సైతం తీవ్రంగా హించేవాడని తెలిపింది. పిల్లలపై ఉమ్మి వేస్తూ, బూతులు తిడుతూ, చితకబాదేవాడని పేర్కొంది. పిల్లలను కొడుతున్న వీడియోలను అత్తమామలకు పంపినా వారు పట్టించుకోకపోవడంతో ఆమె పోలీసులను ఆశ్రయించింది. తనను, పిలల్లను ఆ దుర్మార్గుడి చెర నుంచి తప్పించాలని వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు అజిమోద్దీన్ను అరెస్టు చేశారు. నజీయాబేగం, ఇద్దరు పిల్లలను సఖీ సెంటర్‌కు పంపించినట్లు సీఐ రాజశేఖర్ వెల్లడించారు.
ఇదీ చూడండి:తండ్రి చనిపోతే వచ్చాడు.. కన్న తల్లిని నరికి చంపాడు