మద్యానికి బానిసైన భర్త భార్యతో గొడవపడి ఆమెను కొట్టి చంపాడు. మహబూబ్ నగర్ జిల్లా జడ్చర్ల పురపాలికలోని చైతన్య నగర్లో నివాసించే అనుపటి జంగమ్మ(45)భర్త మల్లేష్తో శనివారం రాత్రి గొడవకు దిగింది. భర్త ఇటుకలతో ఆమె చెవి భాగంలో బలంగా కొట్టడం వల్ల తీవ్రంగా గాయాలపాలై ఆమె ఇంట్లోనే మృతి చెందింది.
భార్యను ఇటుకలతో కొట్టి చంపిన భర్త - భార్యతో గొడవకు దిగిన భర్త
మద్యానికి బానిసైన ఓ భర్త భార్యతో గొడవకు దిగాడు. అది కాస్తా కొట్టుకునే స్థాయికి చేరింది. విచక్షణ కోల్పోయిన భర్త భార్యను ఇటుకలతో బలంగా చెవిపై బాదాడు. భార్యకు తీవ్రంగా గాయాలై మృతి చెందింది. ఈ ఘటన మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లలో చోటుచేసుకుంది.
![భార్యను ఇటుకలతో కొట్టి చంపిన భర్త husband beat his wife to death with bricks at jadcherla mahabubnagar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-8791790-877-8791790-1600054234880.jpg)
భార్యను ఇటుకలతో కొట్టి చంపిన భర్త
సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. తరచూ భార్యాభర్తల మధ్య వివాదం జరిగేవని.. మల్లేష్ హమాలి పనిచేస్తూ మద్యానికి బానిసై భార్యను వేధించేవాడని మృతురాలి సోదరి పెద్దజంగమ్మ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతురాలికి ముగ్గురు సంతానం ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వీరస్వామి తెలిపారు.
ఇదీ చూడండి :ఆన్లైన్ పాఠాలతో ఫోన్ బిల్లుల మోత!