నిర్మల్ జిల్లా సారంగపూర్ మండలం మహావీర్ తండా గ్రామంలో దారుణం జరిగింది. సంతానం కలగలేదన్న కోపంతో భార్యపై గొడ్డలితో దాడి చేశాడు కసాయి భర్త. బాధితురాలి తల వెనుకభాగంలో బలమైన గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న ఆమె తండ్రి హుటాహుటిన జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు.
సంతానం కలగలేదని భార్యపై గొడ్డలితో భర్త దాడి - సంతానం కలగలేదని భార్యపై భర్త దాడి
పిల్లలు కాలేదన్న కారణంతో దారుణానికి ఒడిగట్టాడు కసాయి భర్త. భార్యపై గొడ్డలితో దాడి చేసి గాయపర్చాడు. అపస్మారక స్థితిలో ఉన్న ఆమెను నిర్మల్ జిల్లా ప్రభుత్వ ఏరియా ఆస్పత్రికి తరలించారు. జిల్లాలోని సారంగాపూర్ మండలం మహావీర్ తండాలో ఈ ఘటన చోటు చేసుకుంది.
మహావీర్ తండా గ్రామపంచాయతీ పరిధిలోని దుర్గనగర్కు చెందిన చౌహన్ బండుతో ఆదిలాబాద్ జిల్లా బోథ్ మండలం బిర్లాగొంది గ్రామానికి చెందిన చౌహన్ విజయకు తొమ్మిదేళ్ల క్రితం వివాహమైంది. కొన్నేళ్లు సంసారం సాఫీగానే సాగింది. పిల్లలు కాలేదన్న సాకుతో రెండో పెళ్లి చేసుకుంటానని భార్యను వేధించడం మొదలుపెట్టాడు. ఈ క్రమంలో ఇంట్లో ఒంటరిగా ఉన్న భార్యపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. కుటుంబసభ్యుల ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై రాం నరసింహరెడ్డి వెల్లడించారు.