తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

హిమాయత్​నగర్​లో జరిగిన మహిళ హత్య కేసును మొయినాబాద్​ పోలీసులు ఛేదించారు. భర్తే భార్యను కిరాతకంగా హత్య చేసినట్లు రాజేంద్రనగర్​ ఏసీపీ వెల్లడించారు. కోరిక తీర్చలేదన్న కారణంతో మద్యం తాగి వచ్చి భార్యను అంతమొందించినట్లు నిందితుడు అంగీకరించాడని తెలిపారు.

husband arrested in wife murder
మహిళ హత్య కేసును ఛేదించిన పోలీసులు

By

Published : Jan 5, 2021, 5:49 PM IST

మద్యానికి బానిసైన భర్త.. భార్యను అతి కిరాతకంగా హత్య చేసినట్లు రాజేంద్రనగర్​ ఏసీపీ వెల్లడించారు. హిమాయత్​నగర్​లోని ఓ వెంచర్​లో దారుణ హత్యకు గురైన మహిళ కేసును మొయినాబాద్​ పోలీసులు ఛేదించారు. మద్యం తాగి వచ్చిన భర్త వెంకటయ్య.. తన భార్య కోరిక తీర్చలేదని బండరాయితో మోది చంపేసినట్లు ఏసీపీ సంజీవ్​ కుమార్​ తెలిపారు.

వీరు 15 రోజుల క్రితమే ఉపాధి కోసం వికారాబాద్ జిల్లా తాండూరు మండలం జంగం గ్రామం నుంచి నగరానికి వచ్చారు. కూలీ పనులు చేసుకుని జీవించే వెంకటయ్య మద్యానికి బానిసై రోజు భార్య ఎత్తిరి లక్ష్మితో(28) గొడవ పడేవాడని అన్నారు. ఆరేళ్ల క్రితం ప్రేమవివాహం చేసుకోగా... రెండేళ్ల కూతురు కూడా ఉంది. బుధవారం అర్ధరాత్రి మద్యం తాగి వచ్చి కట్టెతో కొట్టి... కొంతదూరం ఈడ్చుకెళ్లి బండరాయితో మోది హత్య చేశాడని ఏసీపీ పేర్కొన్నారు. దర్యాప్తులో భాగంగా పోలీసులు భర్త వెంకటయ్యను విచారించగా నేరం ఒప్పుకున్నాడు. అతన్ని అరెస్ట్ చేసి రిమాండ్​కు తరలించారు. కేసును ఛేదించిన మొయినాబాద్​ పోలీసులను ఏసీపీ సంజీవ్​కుమార్​ అభినందించారు.

ఇదీ చూడండి:మహిళపై పెట్రోల్​ పోసి కాల్చేశారు.. అత్యాచారం జరిగిందా?

ABOUT THE AUTHOR

...view details