మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో విషాదం చోటుచేసుకుంది. సుభాశ్‌నగర్ బస్తీకి చెందిన మోసం మల్లేశ్(38), నర్మద(36) చెరువులో దూకి ఆత్మహత్య చేసుకున్నారు. బెల్లంపల్లిలో ఓ టీవీ ఛానెల్లో విలేకరిగా పనిచేస్తున్న మల్లేశ్, గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా విధులు నిర్వహిస్తున్న నర్మద.. గురువారం అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో సన్నిహితులకు మొబైల్స్‌లో సందేశాలు పంపారు.
సన్నిహితులకు సందేశం పంపి.. దంపతుల ఆత్మహత్య - husband and wife suicide in mancherial
చెరువులోకి దూకి దంపతులు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలో చోటుచేసుకుంది. సంఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు.. ఒకరి మృతదేహాన్ని బయటకు తీశారు. మహిళ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు.
దంపతుల ఆత్మహత్య
వెంటనే అప్రమత్తమైన స్నేహితులు పోలీసులకు సమాచారం అందించి వారి వద్దకు వెళ్లారు. స్నేహితులు వెళ్లేలోగానే దంపతులు చెరువులోకి దూకారు. ఘటనాస్థలి వద్దకు చేరుకున్న పోలీసులు చెరువులో గాలించారు. శుక్రవారం ఉదయం మల్లేశ్ మృతదేహం లభించింది. నర్మద కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు ఏసీపీ రెహమాన్ తెలిపారు.
Last Updated : Oct 16, 2020, 7:41 PM IST