తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కొలనుపాకలో గుప్తనిధుల వేట! - యాదాద్రి భువనగిరి జిల్లా వార్తలు

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండల పరిధిలోని కొలనుపాక గ్రామంలో గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టారు. విషయం గమనించిన గ్రామ సర్పంచ్​ ఆలేరు పోలీసులకు సమాచారం ఇవ్వగా.. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Hunting for secret funds In Kolanupaka yadadri Bhuvanagiri District
కొలనుపాకలో గుప్తనిధుల కోసం తవ్వకాలు!

By

Published : Sep 6, 2020, 8:38 PM IST

యాదాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలంలోని కొలనుపాక గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తులు గుప్త నిధుల కోసం తవ్వకాలు జరిపారు. గ్రామ శివారులోని పురాతన దుర్గమ్మ దేవాలయం వెనుక దుండగులు గుప్త నిధులకై గోతులు తవ్వారు. ఆలయ పరిసరాలు గమనించిన గ్రామ సర్పంచ్​ పోలీసులకు ఫిర్యాదు చేయగా.. సంఘటనా స్థలానికి చేరుకున్న ఆలేరు పోలీసులు వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై రమేష్​ తెలిపారు.

ABOUT THE AUTHOR

...view details