మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ శివసాయినగర్లోని సాయిబాబా దేవాయలయంలో దుండగులు హుండీ ఎత్తుకెళ్లారు. సోమవారం అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించిన దొంగలు... పూజలు చేసి, హుండీ అపరహించిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో నిక్షిప్తమయ్యాయి.
సాయినాథున్ని వేడుకున్నారు.. హుండీ దోచుకెళ్లారు! - కుషాయిగూడ సాయిబాబా ఆలయంలో హుండీ చోరీ
అర్ధరాత్రి గుడిలోకి ప్రవేశించి దుండగులు హుండీ ఎత్తుకెళ్లిన ఘటన... మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా కుషాయిగూడ శివసాయినగర్లో చోటుచేసుకుంది. నిందితులు పూజలు చేసి, హుండీ ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి.

భక్తిశ్రద్ధలతో పూజలు చేసి హుండీ ఎత్తుకెళ్లారు
సమాచారం అందుకున్న పోలీసులు అక్కడికి చేరుకొని పరిశీలించి, కేసు నమోదు చేశారు. ఆలయాల్లో చోరీకి పాల్పడిని దుండగులను పట్టుకొని కఠింగా శిక్షించాలని కాలనీవాసులు పోలీసులకు విజ్ఞప్తి చేశారు.
సాయినాథున్ని వేడుకున్నారు.. హుండీ దోచుకెళ్లారు!
ఇదీ చూడండి:సీరియల్ కిల్లర్: మహిళలే లక్ష్యం... 16 దారుణ హత్యలు!
Last Updated : Jan 26, 2021, 6:09 PM IST