తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం! - human-skeleton in-concrete-pillar

స్పైడర్​ సినిమాలో సైకో విలన్​ మనుషుల్ని చంపేసి.. వారి శవాల్ని కాంక్రీటు పిల్లర్లలో పడేస్తాడు గుర్తుందా..! అలాంటి సంఘటనే ఇప్పుడూ జరిగింది. ఓ జలాశయ తూములో మనిషి అస్థిపంజరం బయటపడింది. సినీ ఫక్కీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను భయాందోళనలకు గురిచేసింది.

human-skeleton in-concrete-pillar
కాంక్రీటు తూములో మానవ అస్థిపంజరం!

By

Published : Apr 26, 2020, 7:31 PM IST

విజయనగరం జిల్లా మక్కువ మండలం శంబర గ్రామ సమీపంలోని వెంగలరాయ సాగర్‌ వద్ద... మానవ అస్థిపంజరం కలకలం సృష్టించింది. జలాశయం ఎడమ కాల్వ తూములో మనిషి పుర్రె, కాలిన ఎముకలు బయటకు కన్పించాయి. అస్థిపంజరానికి సంబంధించిన మరికొంత భాగం గుడ్డలో కట్టి ఉంది.

తూము కాంక్రీటు శిథిలమైన కారణంగా... అందులో నుంచి ఎముకలు కనిపిస్తున్నాయి. జలాశయం నిర్మాణం జరిగిన సమయంలో మృతి చెందిన వారిని కాంక్రీటులో కలిపి పూడ్చివేసినట్లు స్థానికులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు, పోలీసులు స్పందించాల్సి ఉంది.

ABOUT THE AUTHOR

...view details