కర్ణాటక నుంచి హైదరాబాద్కు తరలిస్తున్న నిషేధిత గుట్కా పాకెట్లను ఎక్సైజ్ పోలీసులు పట్టుకున్నారు. సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి తనిఖీ కేంద్రం వద్ద సోదాలు చేస్తుండగా 13 లక్షల విలువైన గుట్కా పట్టుబడింది.
భారీ స్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు స్వాధీనం - సంగారెడ్డి జిల్లా నేేర సమాచారం
సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ మండలం చిరాగ్పల్లి ఎక్సైజ్ చెక్పోస్ట్ వద్ద భారీస్థాయిలో గుట్కా పట్టుబడింది. మినీ ట్రక్కులో తరలిస్తున్న ఇద్దరు వక్తులను అదుపులోకి తీసుకుని 13 లక్షల విలువైన 80 బస్తాలను స్వాధీనం చేసుకున్నారు.
![భారీ స్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు స్వాధీనం Huge amount of banned gutkha seized excise check post in sangareddy dist](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/768-512-9683424-713-9683424-1606472241040.jpg)
భారీ స్థాయిలో నిషేధిత గుట్కా బస్తాలు స్వాధీనం
మినీ ట్రక్కులో తరలిస్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 80 గుట్కా బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. బీదర్ నుంచి హైదరాబాద్కు తీసుకెళ్తున్నట్లు ఎక్సైజ్ పోలీసులు గుర్తించారు. పట్టుబడిన గుట్కా బస్తాలు, ట్రక్కును చిరాగ్పల్లి పోలీసులకు అప్పగించారు.