తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ - సుమేధ వార్తలు

సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ
సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ

By

Published : Sep 19, 2020, 6:52 PM IST

Updated : Sep 19, 2020, 7:45 PM IST

18:49 September 19

సుమేధ మృతి ఘటనపై స్పందించిన ఎస్‌హెచ్‌ఆర్సీ

ప్రమాదవశాత్తు నాలాలో పడి మృతి చెందిన సుమేధ (12) ఘటనపై రాష్ట్ర మానవ హక్కుల కమిషన్​లో న్యాయవాది మామిడి వేణు మాధవ్ ఫిర్యాదు చేశారు. నగరంలో ఓపెన్ నాలాలు పిల్లల ప్రాణాలు తీస్తూ... తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలిస్తున్నాయంటూ పిటిషన్​లో పేర్కొన్నారు. వర్షాకాలంలో ఇటువంటి ఘటనలు తరుచుగా జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తుందన్నారు.  

ఓపెన్ నాలాలపై కప్పులు వేసి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. నాలాలో పడి ప్రాణాలు కోల్పోయిన ప్రతి బాధిత కుటుంబానికి కోటి రూపాయల నష్టపరిహారం చెల్లించే విధంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని అదేశించాలని కోరారు. స్పందించిన కమిషన్ ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపి నవంబర్ 13లోగా నివేదికను సమర్పించాలంటూ... జీహెచ్ఎంసీ కమిషనర్​ను ఆదేశించింది.

ఇదీ చదవండి:బయటకు వెళ్లిన తల్లీకొడుకులు... చెరువులో విగతజీవులు

Last Updated : Sep 19, 2020, 7:45 PM IST

ABOUT THE AUTHOR

...view details