మేడ్చల్ జిల్లా మల్కాజిగిరిలో భర్త వేధింపులు తట్టుకోలేక ప్రత్యుష(20) అనే గృహిణి.. ఫ్యాన్‌కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల క్రితం రమేశ్ అనే వ్యక్తితో వివాహం జరిపించామని.. ఇచ్చిన కట్నం చాలదంటూ అదనపు కట్నం కోసం ప్రత్యూషను రమేశ్ వేధించేవాడని కుటుంబ సభ్యలు ఆరోపించారు.
అదునపు కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య - అదునపు కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య
మల్కాజిగిరికి చెందిన ప్రత్యుష(20) అనే గృహిణి.. భర్త వేధింపులు తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుంది. రెండేళ్ల నుంచి అదనపు కట్నం కోసం రమేశ్ తమ బిడ్డను వేధింపులకు గురి చేస్తున్నాడని మృతురాలి కుటుంబీకులు తెలిపారు.
అదునపు కట్నం కోసం భర్త వేధింపులు.. భార్య ఆత్మహత్య
శుక్రవారం రాత్రి వీరి మధ్య కట్నం విషమయై మరోసారి గొడవ జరిగినట్లు సమాచారం. దీనితో పాటు మృతురాలి మెడపై చేతి గొర్ల గాట్లు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. కేసు నమోదు చేసిన మల్కాజిగిరి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఇవీ చూడండి:నిర్మల్‌లో వివాహిత అదృశ్యం.. వంతెనపై దొరికిన స్కూటీ, చెప్పులు