హైదరాబాద్‌లో చదువుకునేందుకు వచ్చిన ఓ విద్యార్థిపై... ఓ ప్రైవేటు వసతి గృహపు యాజమాని దాడి చేశాడు. ఆంధ్రప్రదేశ్‌కు చెందిన నాగేంద్ర ప్రసాద్ అనే విద్యార్థి చదువు నిమిత్తం నగరానికి వచ్చాడు. ఎస్సార్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధి వెంగళ్రావునగర్లోని శ్రీ విల్లా డీలక్స్ హాస్టల్‌లో ఉంటున్నాడు.
వైఫై రావట్లేదని ఆడిగినందుకు విద్యార్థిపై హాస్టల్ ఓనర్ దాడి - ఎస్సార్‌నగర్ తాజా వార్తలు
చదువుకునేందుకు నగరానికి వచ్చిన ఓ విద్యార్థి... హాస్టల్‌లో చేరాడు. తన మొబైల్‌కు వైఫై రావటం లేదని యజమాని దృష్టికి తీసుకెళ్లాడు. ఇలా అడిగినందుకు ఆ విద్యార్థిపై సదరు హాస్టల్ యజమాని దాడికి దిగి... తీవ్రంగా గాయపరిచాడు. ఈ ఘటన హైదరాబాద్‌లోని ఎస్సార్‌నగర్‌లో చోటుచేసుకుంది.
వైఫై రావట్లేదని ఆడిగినందుకు విద్యార్థిపై హస్టల్ ఓనర్ దాడి
హాస్టల్‌లో వైఫై రావడంలేదని యజమాని రవీందర్‌ను అడిగినందుకు... తనపై దాడి చేసి గాయపరిచాడని నాగేంద్రప్రసాద్ ఆరోపించాడు. బాధిత విద్యార్థి ఎస్సార్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.