మహబూబాబాద్ జిల్లా తొర్రూరులోని యాదగిరిరెడ్డి ఆసుపత్రిని అధికారులు సీజ్ చేశారు. ఆడపిల్ల పుడుతుందని గర్భవిచ్ఛిత్తి చేసినందుకు డిప్యూటీ డీఎంహెచ్వో కోటాచలం అధికారులతో కలిసి ఆసుపత్రిని మూసివేశారు.
ఐసీడీఎస్ అధికారుల సమాచారంతో విషయం తెలుసుకున్న జిల్లా పాలనాధికారి వీపీ గౌతమ్.. ఆసుపత్రిపై విచారణ జరిపించాలని.. సంబంధిత వైద్యునిపై చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. విచారణ జరిపిన వైద్య ఆరోగ్య శాఖ అధికారులు.. ఆరోపణలు నిజమేనని తేల్చారు.