ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుంతకల్లు జీఆర్పీ స్టేషన్‌కు చెందిన ఓ హోంగార్డు మద్యం మత్తులో ఆర్టీసీ డ్రైవర్, కండక్టర్‌పై విరుచుకుపడ్డాడు. గుత్తి వెళ్లేందుకు గుంతకల్లులో ఓ ఆర్టీసీ బస్సెక్కాడు హోంగార్డు. కాస్త మద్యం సేవించి ఉన్నాడు. కండక్టర్ అతనికి టికెట్ ఇవ్వకుండానే గుత్తి తీసుకెళ్లాడు. తీరా గుత్తి చేరుకున్నాక.. బస్టాండ్ రాకముందే దిగిపొమ్మనాడు. మధ్యలో దిగమంటే ఎలాగని అడిగాడు హోంగార్డు. మాటా మాటా పెరిగింది. చిర్రెత్తిపోయిన హోంగార్డు.. తాను పోలీసునని, అసలు తనను టిక్కెట్టు అడగకూడదని వాదించాడు. ఏమైనా అయితే కాపాడేది మేమే కదా అంటూ అగ్గిమీద గుగ్గిలమయ్యాడు. టికెట్ తీసుకునేది లేదని, అవసరమైతే ఐదు వేలు ఫైన్ కట్టేందుకైనా సిద్ధమంటూ చిందులెేశాడు.
వర్డ్ వార్: మందేసి బస్సెక్కిన హోంగార్డు.. మధ్యలో దిగమన్న కండక్టర్
ఆంధ్రప్రదేశ్ అనంతపురం జిల్లా గుత్తిలో ఓ హోంగార్డు హల్చల్ చేశాడు. కాస్త మందేసి మద్యం మత్తులో ఆర్టీసీ బస్సెక్కాడు. కండక్టర్ టికెట్ ఇవ్వకుండానే అతని ప్రయాణం మొదలైంది. గుంతకల్లు నుంచి గుత్తికి చేరుకున్నాడు. తీరా చేరుకున్నాక ఏం జరిగిందో ఏమో మందులో ఉన్న కానిస్టేబుల్‌ను గమ్యం చేరుకోకముందే మధ్యలోనే దిగిపోవాలని కండక్టర్ కోరాడు. అయితే అనంతపురం జిల్లాలో ఆర్టీసీ బస్సులో పోలీసులను టిక్కెట్ అడుగొద్దంటూ కండక్టర్‌తో వాగ్వాదానికి దిగి గొడవపడ్డాడు ఆ హోంగార్డు.
ఈ వాదనను బస్సు డ్రైవర్ వీడియో తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేశాడు. అసలు కండక్టర్ ఆ కానిస్టేబుల్‌కు టికెట్ ఎందుకు ఇవ్వలేదు? మద్యం మత్తులో ఉంటే అసలు బస్సు ఎందుకు ఎక్కనిచ్చారు? ఇంతకీ చివరికి టికెట్ ఇచ్చారా లేదా? కానిస్టేబుల్ మద్యం తాగి బస్సెక్కొచ్చా? వీళ్ల ఇద్దరి వాగ్వాదం వల్ల తమకు ఇబ్బంది కలిగిందని.. అసలు నిబంధనలు పాటించని ఇలాంటి ప్రభుత్వ సిబ్బంది వల్ల ఆర్టీసీ, పోలీసు వ్యవస్థల ప్రతిష్ఠ దెబ్బ తింటుందని, కండక్టర్, పోలీసు ఇరువురిపైనా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రయాణికులు కోరారు.
- ఇదీ చదవండి:రూ.30 కోసం బావ హత్య.. హంతకుడికి జీవితఖైదు