తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

వివాహేతర బంధానికి బలైన హోంగార్డ్

వరంగల్ గ్రామీణ జిల్లాలో... వివాహేతర బంధం ఓ హోంగార్డును నిర్దాక్షిణ్యంగా హత్య చేయించింది. భార్యతో పరిచయం ఉన్న వ్యక్తి... తన తండ్రి, తమ్ముడితో కలసి ఆధారాలు దొరకకుండా మృతదేహాన్ని కాల్చి బూడిద చేశారు. బూడిదను సమీప చెరువులో కలిపేశారు. కేసును దర్యాప్తు చేసిన నెక్కొండ పోలీసులు నిందితులను అరెస్ట్ చేశారు.

వివాహేతర బంధానికి బలైన హోంగార్డ్
వివాహేతర బంధానికి బలైన హోంగార్డ్

By

Published : Sep 23, 2020, 8:51 PM IST

వివాహేత బంధానికి ఓ హోంగార్డు బలయ్యాడు. వరంగల్ గ్రామీణ జిల్లా నెక్కొండ మండలం గేటుపల్లి తండాకు చెందిన దరియాసింగ్ హన్మకొండలో హోంగార్డుగా విధులు నిర్వర్తిస్తున్నాడు. మహబూబాబాద్ జిల్లా తాళ్ల పూసపల్లికి చెందిన జ్యోతితో ఆరేళ్ల క్రితం వివాహమైంది. నెక్కొండ మండలం అప్బల్​రావుపేటకు చెందిన సాంబరాజుతో ఆమెకు పరిచయం ఏర్పడింది. అది బలపడి వివాహేతర బంధానికి దారితీసింది. ఇదే విషయమై భార్యభర్తలు తరచూ గొడవపడేవారు.

అడ్డుగా ఉన్నాడని...

గత నెల 21నుంచి సెలవులో ఉన్న దరియాసింగ్... ఇంట్లోనే ఉండడం వల్ల తమ బంధానికి అడ్డుగా ఉంటున్నాడన్న అక్కసుతో చంపేయాలని నిర్ణయించుకున్నారు. ఈనెల 14న ఇంట్లో నిద్రిస్తున్న దరియాసింగ్ మెడ చుట్టూ తాడు బిగించి హత్యచేశారు. అనంతరం మృతదేహాన్ని సాంబరాజు ఆటోలో తన పత్తి చేను వద్దకు తీసుకువెళ్లి... తండ్రి, తమ్ముడు సహకారంతో పెట్రోల్ పోసి కాల్చేశారు. మరునాడు ఉదయం చూసేసరికి శవం సగం కాలి ఉండగా... అదే రోజు రాత్రి మరోసారి శవాన్ని పూర్తిగా కాల్చేశారు.

బూడిద కలిపేసి...

అనంతరం బూడిద తీసుకుని సాంబరాజు, అతని తండ్రి యాకయ్యలిద్దరూ... కేసముద్రం చెరువులో కలిపేశారు. మృతుని సోదరుడి ఫిర్యాదు మేరకు దర్యాప్తు జరిపిన నెక్కొండ పోలీసులు... కాల్ డేటా ఆధారంగా నిందితులను అరెస్ట్ చేశారు. దరియాసింగ్ మృతదేహాన్ని కాల్చటంలో సహకరించిన యాకయ్య, సురేశ్​లిద్దరూ పరారీలో ఉన్నారు.

ఇదీ చూడండి: కట్టుకున్న భార్య, కన్నబిడ్డలకు నరకం చూపించిన శాడిస్ట్

ABOUT THE AUTHOR

...view details