తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

విషం తాగి హోంగార్డు ఆత్మహత్య.. కేసు నమోదు - telangana crime news

హైదరాబాద్​లో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. తాను పార్ట్​టైం నడుపుతున్న ఆటోలో కూర్చుని విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.

home guard suicide at ntr marg in hyderabad
విషం తాగి హోంగార్డు ఆత్మహత్య.. కేసు నమోదు

By

Published : Jan 30, 2021, 11:00 PM IST

హైదరాబాద్ ఎన్టీఆర్ మార్గ్​లో ఓ హోంగార్డు ఆత్మహత్య చేసుకున్నాడు. పార్కింగ్ ప్రదేశంలో తాను పార్ట్​టైం నడుపుతున్న ఆటోలో కూర్చుని విషం తాగి బలవన్మరణానికి పాల్పడ్డాడు. మృతి చెందిన హోంగార్డు గుంటూరు జిల్లా రేపల్లె గ్రామానికి చెందిన నాగరాజుగా పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం ఉస్మానియా ఆస్పత్రికి తరలించారు.

కుటుంబ సమస్యల కారణంగానే నాగరాజు ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఇది వరకు సైఫాబాద్ ట్రాఫిక్ పోలీస్​ స్టేషన్​లో పని చేసిన నాగరాజు.. 4 నెలల క్రితమే గోషామహల్ హార్స్ రైడింగ్ కేంద్రానికి బదిలీ అయ్యాడు.

ఇదీ చూడండి: మధిరలో ఉరి వేసుకుని వృద్ధుడు ఆత్మహత్య

ABOUT THE AUTHOR

...view details