ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాల మండలం వాడరేవులో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. సముద్రంలో చేపలు పట్టే విషయంలో వేటపాలెం మండలంలోని కటారివారిపాలెం, రామాపురం మత్య్సకారులు.. వాడరేవు మత్స్యకారుల మధ్య గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో కటారివారిపాలెం, రామాపురం మత్స్యకారులు ఒక్కసారిగా వందల సంఖ్యలో వచ్చి... వాడరేవు మత్స్యకారులపై దాడికి దిగారు. కర్రలు, కత్తులతో విచక్షణారహితంగా దాడులు చేశారు.
వాడరేవులో ఉద్రిక్తత.. కర్రలు, కత్తులతో పరస్పర దాడులు - చీరాల వాడరేవులో ఉద్రిక్తత వార్తలు
చేపలు పట్టే విషయంలో తలెత్తిన వివాదం తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసిన ఘటన ఏపీలోని ప్రకాశం జిల్లా చీరాలలో జరిగింది. వేటపాలెం మండలానికి చెందిన మత్య్సకారులు దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో నలుగురు తీవ్రంగా గాయపడగా... మరో 15 మందిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు.
వాడరేవులో ఉద్రిక్తత..
ఈ ఘటనలో గాయపడిన 15 మందిని చీరాల ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు జాలర్లను చెదరగొట్టారు.
ఇదీ చదవండి:రోడ్డు ప్రమాదం... మెట్రో స్టేషన్ రైలింగ్‌లో తల ఇరుక్కుపోయి...