తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

చెరువు కబ్జాపై హైకోర్టు సీరియస్​.. సుమోటోగా స్వీకరణ

చెరువు కబ్జాపై ఓ సామాజిక కార్యకర్త రాసిన లేఖను.. హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. నాలుగు వారాల్లో.. క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది.

High Court Serious on Pond occupie in hyderabad .. takes as Sumoto
చెరువు కబ్జాపై హైకోర్టు సీరియస్​.. సుమోటోగా స్వీకరణ

By

Published : Jan 9, 2021, 11:56 AM IST

హైదరాబాద్ ఆసిఫ్​నగర్​లోని దేవునికుంట చెరువును కబ్జా చేస్తున్నారని వివరించే ఓ లేఖను హైకోర్టు సుమోటోగా స్వీకరించింది. లుబ్నా సార్వత్ అనే ఓ సామాజిక కార్యకర్త రాసిన లేఖలో పేర్కొన్న సమస్యలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రధాన న్యాయమూర్తులు.. జస్టిస్ హిమా కోహ్లి, జస్టిస్ రామచంద్రారావులతో కూడిన ధర్మాసనం ఈ అంశంపై విచారణను చేపట్టింది.

లేఖలో ప్రస్తావించిన అంశాలను ఉన్నత న్యాయస్థానం పరిశీలించింది. నాలుగు వారాల్లో క్షేత్రస్థాయి నివేదికను సమర్పించాలంటూ ప్రభుత్వాన్ని ఆదేశించింది. కేసు విచారణకు సహకరించేందుకు న్యాయవాది అవినాష్ దేశాయ్​ను అమికస్ క్యూరీగా నియమించింది.

ఇదీ చదవండి:భూ మాయ: మైసమ్మ తల్లి సాక్షిగా చెరువును మింగేశారు!

ABOUT THE AUTHOR

...view details