గత నెలలో పరువు హత్యకు గురైన హేమంత్ కేసులో ప్రధాన నిందితులు అవంతి మేనమామ యుగంధర్‌రెడ్డి, తండ్రి లక్ష్మారెడ్డిలను పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు. విచారణ అనంతరం కోర్టులో హాజరుపరిచారు. ఇదే కేసులో నిందితులుగా ఉన్న మరో ఏడుగురిని పోలీసులు కస్టడీలోకి తీసుకున్నారు.
హేమంత్ హత్య కేసులో లక్ష్మారెడ్డి, యుగంధర్రెడ్డిల నుంచి రాబట్టిన సమాచారంతో మిగిలిన ఏడుగురిని పోలీసులు విచారిస్తున్నారు.
సెప్టెంబర్ 25వ తేదీన హైదరాబాద్‌లో కలకలం సృష్టించిన పరువుహత్య కేసులో చందానగర్‌కు చెందిన హేమంత్ మరణించారు. తన ఇంటికి ఎదురుగా ఉండే అవంతిని ప్రేమించి జూన్ 10వ తేదీన వివాహం చేసుకున్నాడు. పెళ్లిని అంగీకరించని యువతి కుటుంబసభ్యులు కిరాతకంగా హేమంత్‌ను హత్య చేయించారు. ఈ కేసులో ప్రమేయమున్న ప్రతి ఒక్కరినీ శిక్షిస్తామని సీపీ సజ్జనార్ బాధితులకు హామీ ఇచ్చారు.
ఇవీచూడండి:హేమంత్ హత్యకేసులో కస్టడీకి మరో ఏడుగురు నిందితులు