హైదరాబాద్ పాతబస్తీలో భారీగా హవాలా డబ్బు పట్టుబడింది. అక్రమంగా డబ్బు తరలిస్తున్నారన్న సమాచారంతో పశ్చిమ మండల టాస్క్ఫోర్స్ పోలీసులు తనిఖీలు చేయగా... రెండు వేర్వేరు కేసుల్లో రూ.34 లక్షల నగదు పట్టుబడింది. సుల్తాన్‌బజార్‌లో సయ్యద్ అహ్మద్ అనే వ్యక్తి వద్ద ఎలాంటి పత్రాలు లేకుండా తీసుకెళ్తున్న రూ. 21 లక్షలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
రెండు వేర్వేరు కేసుల్లో హవాలా డబ్బు స్వాధీనం - హవాలా డబ్బు స్వాధీనం
జీహెచ్ఎంసీ ఎన్నికల నేపథ్యంలో అక్రమంగా తరలిస్తున్న డబ్బు భారీగా పట్టుబడుతోంది. హవాలా డబ్బు తరలిస్తున్నారన్న సమాచారంతో... రెండు వేర్వేరు కేసుల్లో రూ.34 లక్షల నగదు పట్టుబడింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.
రెండు వేర్వేరు కేసుల్లో హవాలా డబ్బు స్వాధీనం
అఫ్జల్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో హవాలా డబ్బు తరలిస్తున్న ఇద్దరు రాజస్థాన్‌కు చెందిన వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వీరి వద్ద నుంచి రూ. 13 లక్షలు నగదు స్వాధీనం చేసుకుని స్థానిక పోలీస్టేషన్లలో అప్పగించారు. జీహెచ్ఎంసీ ఎన్నికలు ఉన్నందున లక్షల రూపాయల హవాలా డబ్బు పట్టుబడటంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.