కోతుల దాడిలో బాలింత మృతి చెందిన ఘటన సూర్యాపేట జిల్లాలో జరిగింది. మద్దిరాల మండలం కుక్కడం గ్రామానికి చెందిన శ్రీలత(25) రెండు నెలల క్రితమే ప్రసవించింది. తన బిడ్డను కోతులు ఎత్తుకుపోతాయన్న భయంతో మహిళ కర్ర తీసుకోగానే ఆమెపై ముకుమ్మడిగా దాడి చేశాయి. ప్రమాదవశాత్తు ఆమె జారి కిందపడడంతో తలకు బలమైన గాయామవడంతో అక్కడికక్కడే మృతి చెందింది.
కోతుల దాడి.. బిడ్డను కాపాడుకోబోయి బాలింత మృతి - సూర్యాపేట జిల్లాలో బాలింతపై కోతుల దాడి
సూర్యాపేట జిల్లాలో హృదయవిదారక ఘటన జరిగింది. బాలింతపై కోతులు దాడి చేయగా అక్కడికక్కడే మృతిచెందింది. మహిళకు ముగ్గురు చిన్నపిల్లలు సంతానం కావడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది.
హృదయవిదారక ఘటన...కోతుల దాడిలో బాలింత మృతి
ఒక్కసారిగా బాలింత మృతి చెందడంతో కుటుంబసభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మహిళకు ముగ్గురు చిన్నపిల్లలు ఉండడంతో గ్రామస్తులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. మృతురాలి భర్త ఫిర్యాదుతో కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై బండిసాయిప్రశాంత్ తెలిపారు.