భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమ్ముగూడెంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు జరిగిన నాలుగు ఎకరాలకు సంబంధించి ఇద్దరు రైతుల గడ్డివాములు దగ్ధమయ్యాయి. ఈసం కోటేశ్వరరావు అనే రైతుకు చెందిన రెండున్నర ఎకరాల గడ్డివాము పూర్తిగా దగ్ధం కాగా... తాటి వెంకటేశ్వర్లు అనే రైతుకు చెందిన ఎకరంన్నర గడ్డివాము దగ్ధం అవుతుండగా గ్రామస్థలు అప్రమత్తమై కొంత గడ్డిని తీయగలిగారు.
ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం - భద్రాద్రి కొత్తగూడెం జిల్లా తాజా వార్తలు
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు మండలం కొమ్ముగూడెంలో అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు రెండు గడ్డివాములు దగ్ధమయ్యాయి. సమాచారం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది గ్రామానికి చేరుకుని మంటలను ఆర్పారు.
ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం.. గడ్డివాములు దగ్ధం
గాలి తీవ్రతకు మంటలు వ్యాపించకుండా గ్రామస్థలు నిరోధించ గలిగారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. కానీ అప్పటికే గడ్డివాములు పూర్తిగా దగ్ధమైయ్యాయి.
ఇదీ చదవండి: అక్కాతమ్ముడిని మింగేసిన జంపన్నవాగు