తెలంగాణ

telangana

ETV Bharat / jagte-raho

హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా అరెస్ట్​... రూ.16 లక్షలు స్వాధీనం - hawala cash caught in hyderabad

హైదరాబాద్​లో హవాలా ద్వారా డబ్బును తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16 లక్షలతోపాటు ఓ ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు.

హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా అరెస్ట్​... రూ.16 లక్షలు స్వాధీనం
హవాలా డబ్బు తరలిస్తున్న ముఠా అరెస్ట్​... రూ.16 లక్షలు స్వాధీనం

By

Published : Oct 30, 2020, 7:48 PM IST

హవాలా ద్వారా డబ్బును తరలిస్తున్న ముగ్గురు సభ్యుల ముఠాను హైదరాబాద్​ ఉత్తర మండల టాస్క్ఫోర్స్ పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి రూ.16 లక్షలు, ఒక ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. బేగంబజార్​కు చెందిన లలిత్ కుమార్, అశోక్​సింగ్ హవాలా ద్వారా డబ్బు తరలించే ఏజెంటుగా ఒకరు, అసోసియేట్​గా మరొకరు ఉండేవారని పోలీసులు తెలిపారు. ఉప్పల్​కు చెందిన లక్ష్మీకాంత్​రెడ్డి అనే వ్యక్తి హవాలా ద్వారా వచ్చే డబ్బును తీసుకునే వాడన్నారు.

గుజరాత్ రాష్ట్రానికి చెందిన లలిత్​కుమార్ గత ఆరేళ్లుగా హైదరాబాద్​లో హవాలా డబ్బు తరలించేవాడని పోలీసులు తెలిపారు. హవాలా డబ్బుతో ద్విచక్రవాహనంపై సిటీ లైట్ హోటల్ నుంచి అనుమానాస్పదంగా వెళ్తున్న వారిని గుర్తించి అదుపులోకి తీసుకున్నారు. నిందితులను విచారించగా హవాలా డబ్బు తరలిస్తున్నట్లు గుర్తించారు. నిందితులను అరెస్టు చేసి మహంకాళి పోలీసులకు అప్పగించారు.

ఇదీచూడండి: రైలు పట్టాలపై గుర్తు తెలియని మృతదేహం.. కొనసాగుతున్న దర్యాప్తు

ABOUT THE AUTHOR

...view details