ఆర్థిక సమస్యలతో చేనేత కార్మికుడు రైలుకిందపడి ఆత్మహత్య చేసుకున్న ఘటన గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది. పట్టణంలోని వేదనగర్ కాలనీకి చెందిన చేనేత కార్మికుడు రవి(34) అప్పుల బాధతో బలవన్మరణానికి పాల్పడ్డాడు.
రైలు కిందపడి చేనేత కార్మికుడి ఆత్మహత్య - తెలంగాణ నేర వార్తలు
ఆర్థిక ఇబ్బందులతో చేనేత కార్మికుడు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన జోగులాంబ గద్వాల జిల్లా కేంద్రంలో జరిగింది.
రైలుకిందపడి చేనేత కార్మికుడి ఆత్మహత్య
చేనేతే జీవనాధారమైన రవి... గత కొంతకాలంగా ఉపాధి సక్రమంగా లేక ఇబ్బంది పడుతున్నాడు. నేతపని కోసం బ్యాంకులో గతంలో తీసుకున్న రుణభారం పెరిగిపోయింది. ఆర్థిక సమస్యలతో రైలుకింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డి గద్వాల ఆస్పత్రి వద్ద బాధిత కుటుంబాన్ని పరామర్శించారు. ప్రభుత్వ పరంగా నేత కార్మికులకు రావాల్సిన సాయం కోసం చర్యలు తీసుకుంటామన్నారు.
ఇదీ చూడండి:ఎస్సై విధులకు ఆటంకం... నిందితుల అరెస్ట్